ఓ అమ్మాయి ప్రతీకారం

ABN , First Publish Date - 2021-06-12T04:43:54+05:30 IST

చదవుల్లో బంగారు పతకం సాధించిన ఓ అమ్మాయిని నలుగురు యువకులు ఎలా మోసం చేశారు? వాళ్ల మోసాలు తెలుసుకున్న అమ్మాయి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కథతో రూపొందిన చిత్రం ‘దెయ్యంతో సహజీవనం’....

ఓ అమ్మాయి ప్రతీకారం

చదవుల్లో బంగారు పతకం సాధించిన ఓ అమ్మాయిని నలుగురు యువకులు ఎలా మోసం చేశారు? వాళ్ల మోసాలు తెలుసుకున్న అమ్మాయి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కథతో రూపొందిన చిత్రం ‘దెయ్యంతో సహజీవనం’. నిర్మాత నట్టికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రధారి. కుమారుడు నట్టి క్రాంతి నిర్మాత. శనివారం సినిమాలో తొలి పాట విడుదల చేస్తున్నారు.


‘‘త్వరలో పొస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని నట్టి కుమార్‌ చెప్పారు. ‘‘కరోనా టైమ్‌లో కశ్మీర్‌ వెళ్లి చిత్రీకరణ చేసుకొచ్చాం. పొస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తయిన తర్వాత విడుదల తేది ప్రకటిస్తాం’’ అని నట్టి క్రాంతి తెలిపారు. రాజీవ్‌, సుపూర్ణ మాలకర్‌, హరీశ్‌ చంద్ర, బాబూ మోహన్‌, హేమంత్‌, స్నిగ్ధ నటించిన ఈ చిత్రానికి రవిశంకర్‌ సంగీత దర్శకుడు.

Updated Date - 2021-06-12T04:43:54+05:30 IST