ముచ్చటగా మూడోసారి కుదిరింది గురి!

ABN , First Publish Date - 2021-04-08T06:31:12+05:30 IST

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలొచ్చాయి. ఆ రెండూ మహేశ్‌ కెరీర్‌లో స్పెషల్‌ అని చెప్పుకోవాలి. అంతే కాదు...

ముచ్చటగా మూడోసారి కుదిరింది గురి!

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలొచ్చాయి. ఆ రెండూ మహేశ్‌ కెరీర్‌లో స్పెషల్‌ అని చెప్పుకోవాలి. అంతే కాదు... రెండు చిత్రాలకు అభిమానులు ఉన్నారు. మహేశ్‌, త్రివిక్రమ్‌ కలయికలో మరో చిత్రం ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. వాళ్లకో శుభవార్త. ముచ్చటగా మూడోసారి... వీళ్లిద్దరికీ గురి కుదిరిందని విశ్వసనీయ వర్గాల కథనం. ఇటీవల మహేశ్‌కి త్రివిక్రమ్‌ ఓ కథ చెప్పారని, అది హీరోకి నచ్చిందని సమాచారం. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ ‘సర్కారువారి పాట’ చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందని తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారట. మహేశ్‌తో ఇంతకు ముందు ‘మహర్షి’ చిత్రంలో ఆమె నటించారు. ఇక, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆమెకు మూడో చిత్రమిది. ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఎన్టీఆర్‌కు జంటగా, ‘అల... వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపించారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వినికిడి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మించనున్నారట.

Updated Date - 2021-04-08T06:31:12+05:30 IST