సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఫుల్ స్వింగ్ లో ‘డేగల బాబ్జీ’ డబ్బింగ్!

ABN, First Publish Date - 2021-10-22T21:12:13+05:30

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొని, ఆపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గానూ రాణించారు బండ్ల గణేశ్. ఆయనిప్పుడు హీరోగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. యశ్ రుషి బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మి్స్తున్న ఆ సినిమా ‘డేగల బాబ్జీ’. దీనికి వెంకట్ చంద్ర దర్శకుడు. ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక్క చెప్పు సైజ్ 7) తమిళ సినిమాకిది రీమేక్ వెర్షన్. పార్తిబన్ హీరోగా ఆయన దర్శక నిర్మాణంలోనే రూపొందిన ఈ సినిమాని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొని, ఆపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గానూ రాణించారు బండ్ల గణేశ్. ఆయనిప్పుడు హీరోగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. యశ్ రుషి బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్న ఆ సినిమా ‘డేగల బాబ్జీ’. దీనికి  వెంకట్ చంద్ర దర్శకుడు. ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక్కటే చెప్పు సైజ్ 7) తమిళ సినిమాకిది రీమేక్ వెర్షన్. పార్తిబన్ హీరోగా ఆయన దర్శక నిర్మాణంలోనే రూపొందిన ఈ సినిమాని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. థియేటర్స్ లోనూ బాగా ఆడింది. ఈ సినిమా విశేషమేంటంటే.. ఇందులో ఒక్క పాత్రే ఉంటుంది. ఇక ‘డేగల బాబ్జీ’ సినిమా డబ్బింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు బండ్ల గణేశ్ ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు. డబ్బింగ్ రూమ్ లోని మేనిటర్ లో తన విజువల్ రివీలయ్యే  ఒక పిక్ ను పోస్ట్ చేశారు. డిఫరెంట్ ఫిల్మ్. బ్లెస్ చేయండి అని కేప్షన్  కూడా ఇచ్చారు. మరి ఈ సినిమాతో బండ్ల గణేశ్ ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటారో చూడాలి. 



Updated Date - 2021-10-22T21:12:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!