సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Project -k: ప్రభాస్‌–దీపికా పడుకోన్‌ సీన్‌ షురూ!

ABN, First Publish Date - 2021-12-04T21:13:50+05:30

బాలీవుడ్‌ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకోన్‌ భాగ్యనగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఆమె అడుగుపెడితే పెద్ద వింత ఏమిటి అనుకుంటున్నారా? తెలుగులో ఆమె నటించబోయే తొలి సినిమా షూటింగ్‌ కోసం ఆమె భాగ్యనగరంలో వాలిపోయింది. ప్రభాస్‌ హీరోగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ‘ప్రాజెక్ట్‌ –కె’లో దీపికా పడుకోన్‌ కథానాయిక.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లో ‘ప్రాజెక్ట్‌– కె’ చిత్రీకరణ 

క్వీన్‌ దీపికాకు స్వాగతం: వైజయంతీ మూవీస్‌

బాలీవుడ్‌ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకోన్‌ భాగ్యనగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఆమె అడుగుపెడితే పెద్ద వింత ఏమిటి అనుకుంటున్నారా? తెలుగులో ఆమె నటించబోయే తొలి సినిమా షూటింగ్‌ కోసం ఆమె భాగ్యనగరంలో వాలిపోయింది. ప్రభాస్‌ హీరోగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ‘ప్రాజెక్ట్‌ –కె’లో దీపికా పడుకోన్‌ కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా రాణిగా నటించనుంది. దీనికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. వెల్‌కమ్‌ క్వీన్‌ దీపికా’ అంటూ నిర్మాణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జూన్‌లో అమితాబ్‌ బచ్చన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే! డాని శాంచెజ్‌–లోపెజ్‌.. ఛాయగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు. 



Updated Date - 2021-12-04T21:13:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!