సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దీపిక షాకింగ్ ప్రవర్తన.. కారణం అదే!

ABN, First Publish Date - 2021-01-01T19:15:56+05:30

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన అభిమానులకు షాకిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన అభిమానులకు షాకిచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడం లేదా తమ కొత్త సినిమా అప్‌డేట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అయితే దీపిక మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాల్లోని పోస్టులన్నింటినీ డిలీట్ చేసింది. 


దీపికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 52 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ట్విటర్‌లో 27 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రెండు ఖాతాల్లో ఇప్పటివరకు చేసిన పోస్టులన్నింటినీ దీపిక డిలీట్ చేసేసింది. దీపిక ఇలా ఎందుకు చేసిందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అయితే తన ఉద్దేశాన్ని వివరిస్తూ దీపిక తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ను పోస్ట్ చేసింది. నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే దీపిక తన పాత పోస్టులన్నింటినీ డిలీట్ చేసింది. ఎన్నో విషయాలు నేర్పిన 2020కి అందరూ రుణపడి ఉండాలని పేర్కొంది. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది. 



Updated Date - 2021-01-01T19:15:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!