సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘దర్జా’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

ABN, First Publish Date - 2021-10-22T00:29:47+05:30

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను మాజీ హెల్త్ మినిస్టర్, చిత్ర సమర్పకుడైన కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘శివ శంకర్ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తోన్న ‘దర్జా’ చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. ఈ చిత్రయూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టైటిల్ లుక్‌ని విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్‌గారికి ధన్యవాదాలు. సీనియర్ నటీనటులు, నూతన నటీనటుల కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రదేశాలలో షూటింగ్ జరపనున్నాం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో సునీల్, అనసూయ పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

Updated Date - 2021-10-22T00:29:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!