డిజిటల్‌ క్రైమ్‌ నేపథ్యంలో చక్ర

ABN , First Publish Date - 2021-02-02T07:10:34+05:30 IST

విశాల్‌ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చక్ర’. శ్రద్దా శ్రీనాథ్‌ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర కీలక...

డిజిటల్‌ క్రైమ్‌ నేపథ్యంలో చక్ర

విశాల్‌ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చక్ర’. శ్రద్దా శ్రీనాథ్‌ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ వెల్లడించింది. విశాల్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్‌ క్రైమ్‌ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా కాంబినేషన్‌లో నేను చేస్తున్న పదో చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌, సాంగ్స్‌కి రెస్పాన్స్‌ బావుంది’’ అని అన్నారు. 

Updated Date - 2021-02-02T07:10:34+05:30 IST