సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘క్రేజీ అంకుల్స్‌’ సినిమాను ఆపండి!

ABN, First Publish Date - 2021-08-18T23:56:39+05:30

మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు రేఖ, రత్నా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంపాదన కోసం మహిళల్ని కించపరుస్తున్నారు..

బండ్ల గణేశ్‌.. సమాజానికి చెప్పే నీతులు ఇవేనా? 

సత్తిబాబు.. ‘జబర్దస్త్‌’లాంటి షో డైరెక్ట్‌ చేసుకో...

మనో పాటకు కాదు బూతుకి పెద్ద దిక్కుగా మారుతున్నారు..

బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా ఆపాలి! 

- తెలంగాణ మహిళా హక్కుల వేదిక డిమాండ్‌


మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు రేఖ, రత్నా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ‘‘విడుదలకు సిద్ధమైన అంకుల్స్‌ సినిమా ట్రైలర్‌ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని ఆరోపించారు. మహిళలను సగటు ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య పదజాలంతో కూడిన సినిమా రూపొందించడం సరికాదు అన్నారు. ట్రైలర్‌ అంత అసభ్యంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. డబ్బు సంపాదన కోసం మహిళల్ని కించపరుస్తూ సినిమాలు తీయడం అన్యాయమన్నారు. అసలు ఈ చిత్రాన్ని  సెన్సార్‌ బోర్డ్‌ ఎలా అనుమతించింది. చిత్ర బృందం యావత్‌ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాలని హెచ్చరించారు. లేకుంటే తెలుగు రాష్ట్రాల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. 


ట్రైలర్‌లో అభ్యంతరకరంగా ఉన్న అంశాలు... 

- ట్రైలర్‌లో ఉన్న సంభాషణలపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘భార్యలు చూడడానికి తప్ప .... పనికిరారు’ అనే డైలాగ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి. సంసారం చేసే మహిళల పట్ల ఇలాంటి డైలాగులను ఉపయోగించడం ఎంతవరకు న్యాయం? 


– హీరోయిన్ల కంటే వాళ్ల మేనేజర్లు, పీఏల సంపాదనే ఎక్కువ ఉంటుంది.. అంటే, ఇండస్ర్టీ అంతగా చెడిపోయిందనుకోవాలా.? మరోసారి మీటూ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నారా? గతంలో మేనేజర్లే హీరోయిన్లను కమిట్‌ మెంట్‌ అడిగేవారని పలువురు వ్యాఖ్యానించారు. దీనిని ఎలా చూడాలి? ఆ సంభాషణలను సినిమా నుంచి తొలగించాలి. 


– బడా నిర్మాత బండ్ల గణేశ్‌.. స్వయంగా ఈ డైలాగ్‌ చెబుతున్నాడు. అంటే ఆయన సినిమాల్లో ఇలాంటివి ఎంకరేజ్‌ చేస్తాడా? రాజకీయ నాయకుడిగా మారిన ఆయన సమాజానికి చెప్పే నీతులు ఇవేనా? 


సింగర్‌ మనో అంటే ఇప్పటిదాకా అభిమానం ఉంది. ఎస్పీ బాలు తర్వాత తెలుగు పాటకు పెద్ద దిక్కుగా అవుతారని భావించాం.  కానీ, ఆయన బూతుకి పెద్ద దిక్కుగా మారేలా కనిపిస్తున్నారు. అడల్ట్‌ కామెడీ షోగా ముద్రపడిన జబర్దస్త్‌లో ఆయన డైలాగులన్నీ చూస్తున్నాం.. ఇలాంటి పాత్రలను ఆయన ఎలా చేశారు? 


- దర్శకుడు ఈ.సత్తిబాబుకి మంచి పేరుంది. ఇప్పటిదాకా కుటుంబం మొత్తం హాయిగా చూస్తే కామెడీ సినిమాలు తీశారు. ఇప్పుడు అడల్ట్‌ కామెడీ చేస్తున్నాడు. ఆయన జబర్దస్త్‌ లాంటి షోను డైరెక్ట్‌ చేసుకోమని చెప్పండి.  ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొడతారా? అని మహిళా సంఘాలు పేర్కొన్నాయి. 


ఒక్క రాత్రి కోసం 50లక్షలు ఖర్చు అయినా పర్లేదు.. ఎవరండీ ఈ డైలాగులు రాసింది. మహిళలను భోగ వస్తువుగా చూపిస్తారా? ఇప్పటికే మహిళలపై సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలు చూడడం లేదా? ఈ దర్శక నిర్మాతలు, హీరోలు ఇలాంటివి ఎంకరేజ్‌ చేేస్త అవి మరింతగా పెరగవా? 


- ఈ సినిమా నిర్మాతలు గతంలో ‘ఈరోజుల్లో’ సినిమా తీశారు. అది బూతు సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు మారుతి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ఆయనకు కూడా బ్యాడ్‌ నేమ్‌ వచ్చింది. మరో మారుతిని ఇండస్ర్టీకి పరిచయం చేయాలనుకుంటున్నారా?


- బాలీవుడ్‌లో రాజ్‌కుంద్రా సీక్రెట్‌గా అడల్ట్‌ కంటెంట్‌తో తీస్తే ఇలాంటి నిర్మాతలు డైరెక్ట్‌గా సినిమా తీసి పబ్లిక్‌గా రిలీజ్‌ చేస్తారా?


- గుడ్‌ ఫ్రెండ్స్‌ అని బ్యానర్‌కు పేరు పెట్టి నీచమైన సినిమాలు తీస్తారా? సినిమాని 19వ తేదీన విడుదల చేయనీయం. ధర్నాలు చేసి మహిళ గౌరవాన్ని కాపాడుదాం. 





Updated Date - 2021-08-18T23:56:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!