దర్శకుడిని బలి తీసుకొన్న కరోనా
ABN , First Publish Date - 2021-04-27T05:58:06+05:30 IST
కరోనా మరో తెలుగు దర్శకుడిని బలి తీసుకుంది. కరోనా వైరస్ సోకి పది రోజుల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...

కరోనా మరో తెలుగు దర్శకుడిని బలి తీసుకుంది. కరోనా వైరస్ సోకి పది రోజుల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దర్శకుడు సాయిబాలాజీ సోమవారం ఉదయం కన్నుమూశారు. 57 ఏళ్ల సాయిబాలాజీ అసలు పేరు నక్కల వరప్రసాద్. తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపురం ఆయన స్వస్థలం. దర్శకుడు రవిరాజా పినిశెట్టి శిష్యుడైన సాయిబాలాజీ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు, ఉదయ్‌కిరణ్ చివరి చిత్రం ‘జైశ్రీరామ్’కు దర్శకత్వం వహించారు. చిరంజీవి హీరోగా నటించిన ‘బావగారూ బాగున్నారా’ చిత్రానికి ఆయనే కథ, స్ర్కీన్‌ప్లే రచయిత.. కొన్ని సీరియల్స్‌కు కూడా ఆయన దర్శకత్వం వహించారు. కృష్ణవంశీ, వై.వి.ఎ్‌స.చౌదరి నిర్మించిన చిత్రాలకు కథావిభాగంలో పనిచేశారు. స్ర్కీన్‌ప్లే మీద, ప్రపంచ సినిమా మీద బాగా పట్టున్న దర్శకుడు సాయిబాలాజీ. ఆయన భార్య గౌరి, కుమార్తె స్నేహపూజితకు కూడా కరోనా సోకింది. అయితే వాళ్లిద్దరూ ఇంట్లోనే ఉండి కోలుకోగా, సాయిబాలాజీ మాత్రం మృత్యువు బారినుంచి తప్పించుకోలేకపోయారు. సోమవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.