సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సూపర్‌స్టార్‌ ఇంట్లో కరోనా కలకలం!

ABN, First Publish Date - 2021-12-30T23:58:15+05:30

కరోనా తగ్గుముఖం పడుతుంది.. అని ఆనందపడుతున్న తరుణఃలో మరోసారి విజృంభిస్తుంది. ఒమెక్రాన్‌ పేరుతో కొత్త వేరియంట్‌ మళ్లీ జనాలను భయపెడుతోంది. తాజాగా సూపర్‌ మహేశ్‌బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. తన భార్య నమ్రతా శిరోధ్కర్‌ సోదరి శిల్పాశిరోద్కర్‌ కరోనా బారినపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా తగ్గుముఖం పడుతుంది.. అని ఆనందపడుతున్నతరుణంలో మరోసారి విజృంభిస్తుంది. ఒమెక్రాన్‌ పేరుతో కొత్త వేరియంట్‌ మళ్లీ జనాలను భయపెడుతోంది. తాజాగా సూపర్‌ మహేశ్‌బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. తన భార్య నమ్రతా శిరోధ్కర్‌ సోదరి శిల్పాశిరోద్కర్‌ కరోనా బారినపడ్డారు. ‘హమ్‌’, ‘ఖుదాగవా’, ‘ఆంఖే’ చిత్రాలతో మెప్పించిన ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో నివశిస్తున్నారు. మహేశ్‌, నమ్రతా, శిల్పాల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే! మహేశ్‌ ఇంట జరిగే ఏ కార్యక్రమంలోనైనా తప్పకుండా ఉంటారు, నాలుగు రోజులుగా ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘‘అందరూ సురక్షితంగా ఉండండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. నియమాలు పాటించండి’’ అని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని నమ్రతా కామెంట్‌ పెట్టారు. 




Updated Date - 2021-12-30T23:58:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!