కంటెంట్‌ ఉన్న సినిమా

ABN , First Publish Date - 2021-10-04T07:21:55+05:30 IST

నవీన్‌చంద్ర, క్రిష్‌ సిద్ధిపల్లి, రాజా రవీంద్ర, గాయత్రి ఆర్‌ సురేశ్‌, అదితీ మ్యాకల్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’....

కంటెంట్‌ ఉన్న సినిమా

నవీన్‌చంద్ర, క్రిష్‌ సిద్ధిపల్లి, రాజా రవీంద్ర, గాయత్రి ఆర్‌ సురేశ్‌, అదితీ మ్యాకల్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. ఈ నెల 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ట్రైలర్‌, సాంగ్స్‌ను నిర్మాత వివేక్‌ కూచిభొట్ల, దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య, స్వర్ణ బాబు మాస్టర్‌ విడుదల చేశారు. వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ ‘‘నేను లేని నా ప్రేమకథ’ అనేది చాలా గొప్ప టైటిల్‌. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు. వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ ‘‘నేను సినిమా చూశాను. కొత్త తరహా కథాంశంతో ఆకట్టుకుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఉత్తరాది సురేశ్‌, నిర్మాతలు: కల్యాణ్‌ కందుకూరి, డాక్టర్‌ భాస్కర్‌రావు అన్నదాత.


Updated Date - 2021-10-04T07:21:55+05:30 IST