సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నాకు వాళ్లతోనే పోటీ

ABN, First Publish Date - 2021-01-18T10:34:37+05:30

‘‘పదిహేనేళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి సీజన్‌లో నా సినిమా విడుదలైంది. నాకు అసలైన పోటీ ఎవరన్నది ఇప్పుడు అర్థమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘పదిహేనేళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి సీజన్‌లో నా సినిమా విడుదలైంది. నాకు అసలైన పోటీ ఎవరన్నది ఇప్పుడు అర్థమైంది. నేను ప్రేక్షకుల మీద చూపించే అభిమానం, అభిమానులు నా మీద చూపించే అభిమానం ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. ఇంతకు మించి పోటీ ఇంకేం ఉంటుంది’’ అని రామ్‌ పోతినేని అన్నారు. ఆయన హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్‌ నిర్మించిన ‘రెడ్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ శనివారం విశాఖపట్టణంలో జరిగాయి. రామ్‌ మాట్లాడుతూ ‘‘చాలా ట్విస్టులతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తీసాం. సినిమాకు రెస్పాన్స్‌ ఎలా ఉంటుందోనని ఎగ్జైటింగ్‌గా ఎదురు చూశాం. మార్నింగ్‌ షోకి  ఉన్నఅభిప్రాయాలన్ని సాయంత్రానికి మారిపోయాయి. ఇది పేక్షకులు మాకు ఇచ్చిన ట్విస్ట్‌. ఈ కథని అద్భుతంగా తెరకెక్కిచిన కిషోర్‌ తిరుమలకి ధన్యవాదాలు. ఈ చిత్రానికి మూల స్తంభంలా మణిశర్మ నిలుచున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత మరో హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. మీకు పోటీ ఎవరని చాలామంది అడుగుతుంటారు. అభిమానులు చూపించే ప్రేమ ఎక్కువా, నేను అభిమానులపై చూపించే ప్రేమ ఎక్కువా అన్న దాంట్లోనే పోటీ నడుస్తోంది’’ అని అన్నారు. ‘‘రెడ్‌’ సినిమా సక్సెస్‌కి హీరో రామ్‌ కారణం. ఆయన చేసిన మాస్‌ క్యారెక్టర్‌ని జనాలు ఎంజాయ్‌ చేస్తున్న తీరును మాటల్లో చెప్పలేను’’ అని కిశోర్‌ తిరుమల అన్నారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారు. దశావతారంలో మీ నట విశ్వరూపం ఎప్పుడు చూపిస్తారన్న అభిమానుల ప్రశ్నకు ‘అలాంటి కథ దొరికితే కచ్చితంగా చేస్తా’ అని రామ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు కృష్ణ పోతినేని, మాళవిక శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-18T10:34:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!