కామెడీ ఎంటర్‌టైనర్‌

ABN , First Publish Date - 2021-12-14T06:35:41+05:30 IST

లక్ష్మణ్‌, కిశోరి దాత్రక్‌ హీరోహీరోయిన్లుగా నటించే రైజింగ్‌ హాండ్స్‌ ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం ఫిల్మ్‌ నగర్‌ సాయిబాబా టెంపుల్‌లో మొదలైంది...

కామెడీ ఎంటర్‌టైనర్‌

లక్ష్మణ్‌, కిశోరి దాత్రక్‌ హీరోహీరోయిన్లుగా నటించే రైజింగ్‌ హాండ్స్‌ ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం షూటింగ్‌ సోమవారం ఉదయం ఫిల్మ్‌ నగర్‌ సాయిబాబా టెంపుల్‌లో మొదలైంది. ఈ చిత్రంతో డి.నాగ శశిధర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి జీడీ డైరెక్టర్‌ విశ్వనాథ్‌ అరిగెల కెమెరా స్విచ్‌ఆన్‌ చేయగా, నిర్మాత  రాజ్‌ కందుకూరి తొలి క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు అశోక్‌ స్ర్కిప్ట్‌ అందజేశారు. ఈ సందర్భంగా రద్శకుడు న ఆగవశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. టైటిల్‌లను త్వరలో ప్రకటింస్తాం. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 22నుండి ప్రారంభం అవుతుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: శేఖర్‌రాజు విజయభట్లు, సంగీతం: రుద్రకిరణ్‌, ఎడిటర్‌: ప్రణీత్‌కుమార్‌, నిర్మాతలు: పార్థసారథి, డి.నాగేందర్‌ రెడ్డి, రచన, దర్శకత్వం: డి.నాగ శశిశిధర్‌ రెడ్డి.

Updated Date - 2021-12-14T06:35:41+05:30 IST