చలో కేరళ!
ABN , First Publish Date - 2021-01-28T10:45:55+05:30 IST
‘పుష్ప’ సినిమా షెడ్యూల్ కేరళలో జరగనుంది. ప్రస్తుతం మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుగుతోంది. ఫిబ్రవరి తొలి వారానికి అక్కడి షెడ్యూల్...

‘పుష్ప’ సినిమా షెడ్యూల్ కేరళలో జరగనుంది. ప్రస్తుతం మారేడుమిల్లిలో చిత్రీకరణ జరుగుతోంది. ఫిబ్రవరి తొలి వారానికి అక్కడి షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పది రోజులు చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ ముగిశాక... కేరళ వెళ్లాలనీ, అక్కడ ఓ భారీ షెడ్యూల్ చేయాలనీ ఆలోచిస్తున్నారు. తొలుత ఈ సినిమా చిత్రీకరణను కేరళలో చేయాలని అనుకున్నారు. అయితే, కరోనా తదరనంతర పరిస్థితుల నేపథ్యంలో మారేడుమిల్లిని ఎంచుకున్నారు. గత పదిహేను రోజులుగా అటవీ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్, ఇతర తారాగణంపై దర్శకుడు సుకుమార్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. గత డిసెంబర్ తొలి వారంలో చిత్రబృందంలోని కొందరు కరోనా బారిన పడటం, నిహారిక పెళ్లి వంటివి ఉండటంతో మధ్యలో చిన్న చిన్న విరామాలు వచ్చాయి. ఇకపై శరవేగంగా చిత్రీకరణ చేయాలని భావిస్తున్నారు. శేషాచలం అడవుల్లో కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారిన యువకుడిగా అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని సమాచారం.