కలర్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌

ABN , First Publish Date - 2021-12-30T05:59:39+05:30 IST

నరేష్‌ అగస్త్య, సంజన సార థి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరసాలు చాలు’. బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది...

కలర్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌

నరేష్‌ అగస్త్య, సంజన సార థి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరసాలు చాలు’. బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ సందీప్‌ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ స్ర్కిప్ట్‌ అందించగా శృతిరెడ్డి క్లాప్‌ ఇచ్చారు. చంద్రకాంత్‌రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ‘రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందించామని బి. చంద్రకాంత్‌రెడ్డి తెలిపారు. ‘‘పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్‌ ఫుల్‌ బ్రీజీ ఎంటర్టైనర్‌. వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు. భరత్‌ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. డి.వో.పి:రోహిత్‌ బట్చు


Updated Date - 2021-12-30T05:59:39+05:30 IST