20 లుక్కులతో కోబ్రా!

ABN , First Publish Date - 2021-06-13T06:27:11+05:30 IST

ప్రయోగాలు చేయడం విక్రమ్‌కు వెన్నతో పెట్టిన విద్య. నటుడిగా కొత్త లుక్కుల్లో కనిపించడానికి ఇష్టపడతారు. ఈ ఫొటో చూస్తుంటే...

20 లుక్కులతో కోబ్రా!

ప్రయోగాలు చేయడం విక్రమ్‌కు వెన్నతో పెట్టిన విద్య. నటుడిగా కొత్త లుక్కుల్లో కనిపించడానికి ఇష్టపడతారు. ఈ ఫొటో చూస్తుంటే... మరో కొత్త లుక్‌లో ఆయన కనిపించడానికి సిద్ధమవుతున్నట్టు ఉంది కదూ! తెలుగులో ‘అంజలి సి.బి.ఐ’గా విడుదలైన తమిళ హిట్‌ ‘ఇమైక్క నోడిగల్‌’ ఫేమ్‌ ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కోబ్రా’. టీజర్‌ విడుదలైంది. అందులో మూడు లుక్స్‌లో కనిపించారు. చిత్రంలో ఏకంగా 20 లుక్కుల్లో కనిపిస్తారని సమాచారం. కరోనా వల్ల ఆగిన చిత్రీకరణ, త్వరలో మళ్లీ మొదలు కానుంది. ‘‘సాధారణ రోజులకు చేరుకోవడానికి అతి దగ్గరలో ఉన్నాం. మళ్లీ చిత్రీకరణ ప్రారంభించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అని దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు ఈ ఫొటో షేర్‌ చేశారు. త్వరలో కెమెరా ముందుకు కోబ్రా రానున్నాడన్నమాట. ఇందులో గణిత శాస్త్రజ్ఞుడిగా విక్రమ్‌ కనిపించనున్నారు. ఆయన సరసన హీరోయిన్‌గా ‘కె.జి.యఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధీ శెట్టి నటిస్తున్నారు. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మియా జార్జ్‌, దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కోబ్రా’ కాకుండా... మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’, కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తనయుడు ధ్రువ్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నారు విక్రమ్‌.


Updated Date - 2021-06-13T06:27:11+05:30 IST