ఎక్స్‌క్లూజివ్‌: దర్శకుడవుతోన్న మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌

ABN , First Publish Date - 2021-01-19T01:32:51+05:30 IST

మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ దర్శకుడిగా మారుతున్నారు. పలు భాషల్లో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా

ఎక్స్‌క్లూజివ్‌: దర్శకుడవుతోన్న మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌

మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ దర్శకుడిగా మారుతున్నారు. పలు భాషల్లో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ 'అంజి' (పీఎస్వీ గరుడవేగ ఫేమ్‌) ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ దర్శకుడిగా మారి కళ్యాణ్‌ రామ్‌తో '118' చిత్రాన్ని రూపొందించి.. దర్శకుడిగానూ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్‌ అంజి కూడా ఓ పవర్‌ఫుల్‌ స్టోరీతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వం చేయనున్న చిత్రానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


శ్రీరామ్‌, అవికాగోర్‌ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'టెన్త్‌ క్లాస్‌ డైరీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం చిక్‌మంగుళూర్‌లో ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ ఇటీవలే మొదలైంది. ఈ షెడ్యూల్‌ ఏకధాటిగా ఫిబ్రవరి ఎండింగ్‌ వరకు ఉండనుంది. నాజర్‌, అర్చన వంటి నటీనటులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడే.. ఓ పవర్‌ ఫుల్‌ కథతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని, త్వరలోనే అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటిస్తామని దర్శకుడు 'గరుడవేగ అంజి' ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. Updated Date - 2021-01-19T01:32:51+05:30 IST