దాసరికి సినీ ప్రముఖుల ఘన నివాళులు
ABN , First Publish Date - 2021-05-04T19:42:20+05:30 IST
దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని... ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని ఆయన విగ్రహాన్ని సందర్శించి పూలమాలల వేసి ఘన నివాళులు అర్పించారు.
దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని... ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని ఆయన విగ్రహాన్ని సందర్శించి పూలమాలల వేసి ఘన నివాళులు అర్పించారు. 'మా' అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రఫర్ సత్య మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన దాసరి దర్శకుడిగానే కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి. ఎంతో మంది దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.