‘చితక్కొట్టుడు 2’ ఎప్పటి నుంచి అంటే..
ABN , First Publish Date - 2021-01-03T04:10:20+05:30 IST
‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.. తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.. తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'చితక్కొట్టుడు 2' చిత్రం విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. మొదటి వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సంతోష్. పి. జయకుమారే.. ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. అంతేకాదు ఆయన ఇందులో హీరోగా కూడా చేయడం విశేషం. ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ఎస్. హరి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా.. ''ఇప్పటివరకు వచ్చిన అడల్ట్ హారర్ కామెడీ చిత్రాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మొదటి వెర్షన్ కి మించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఉంటుంది. లాక్‌డౌన్ తరువాత దీపావళికి తమిళనాట విడుదలైన తొలి చిత్రం ఇదే. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకి కనువిందు చేసే చిత్రం ఇది'' అని తెలిపారు ఈ చిత్ర దర్శకుడు, హీరో సంతోష్. పి. జయకుమార్.