‘ఎఫ్.సి.ఏ’ నూతన కార్యవర్గానికి చిరు అభినందనలు
ABN , First Publish Date - 2021-07-26T22:46:43+05:30 IST
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక ఆదివారం జరిగింది. నూతన అధ్యక్షుడిగా జర్నలిస్ట్ ప్రభు ఎంపికయ్యారు. జర్నలిస్ట్ ప్రభుతో పాటు నూతనంగా ఎన్నికైన టీమ్‌కు సోమవారం మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక ఆదివారం జరిగింది. నూతన అధ్యక్షుడిగా జర్నలిస్ట్ ప్రభు ఎంపికయ్యారు. జర్నలిస్ట్ ప్రభుతో పాటు నూతనంగా ఎన్నికైన టీమ్‌కు సోమవారం మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘అధ్యక్షులైన మీరు(ప్రభు), ఇదొక మంచి అవకాశంగా భావించి మీ వాళ్ళందరికీ మంచి చేయడానికీ, వారి సంక్షేమం కోసం మీ సేవలు అందించడానికి ప్రయత్నం చేయండి. దానికి ఇదో చక్కని అవకాశం. సద్వినియోగ పరచుకోండి. పదవి అలంకారం కాకుండా బాధ్యతగా పనిచేయండి. పదిమందికి ఉపయోగపడండి. తద్వారా మానసిక ఆనందం ఎంత ఉంటుందో ఊహించలేరు. అలాగే నా మిత్రులైన మిగిలిన వారంతా మీ మార్కు సేవలు అందించండి. ఎలాంటి విమర్శలకు తావులేకుండా అందరికీ తలలో నాలుకలా ఉండాలనీ, ఉంటారని అనుకుంటున్నాను. మరొక్కసారి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి శుభాభినందనలు’’ అని తెలిపారు.