సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు : చిరంజీవి

ABN, First Publish Date - 2021-12-01T17:02:02+05:30

ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘శాస్త్రిగారి మరణం నన్ను చాలా బాధిస్తోంది. ఇది చాలా చాలా దురదృష్టకరం. ఆయన్ని మంచి చికిత్స కోసం చెన్నైకి తీసుకెళ్తానని చెప్పాను. ఈ నెలాఖరున తాను డిస్చార్జ్ అవుతానని.. అప్పుడు చెన్నైకి తప్పకుండా వెళ్దామని చెప్పారు. ఇంతలోనే ఆయన్ని ఇలా చూస్తానని అనుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘శాస్త్రిగారి మరణం నన్ను చాలా బాధిస్తోంది. ఇది చాలా చాలా దురదృష్టకరం. ఆయన్ని మంచి చికిత్స కోసం చెన్నైకి తీసుకెళ్తానని చెప్పాను.  ఈ నెలాఖరున తాను డిస్చార్జ్ అవుతానని.. అప్పుడు చెన్నైకి తప్పకుండా వెళ్దామని చెప్పారు. ఇంతలోనే ఆయన ఇలా వస్తారని అనుకోలేదు.  ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఎప్పుడూ నన్ను మిత్రమా అని పిలిచేవారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవడం చిత్ర పరిశ్రమకి తీరని లోటు. మంచి మిత్రుడ్ని కోల్పోయాను. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నా కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు. నడిచే నక్షత్రం అంటూ నాకోసమే రాశానని అనేవారు. ఆయన జ్ఞాపకార్ధం ఏదో ఒక కార్యక్రమం తప్పకుండా చేస్తాం.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

Updated Date - 2021-12-01T17:02:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!