చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. కారణం ఇదే!

ABN , First Publish Date - 2021-10-18T02:41:35+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి కుడి చేతికి సర్జరీ జరిగింది. ఆదివారం బ్లడ్‌ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండడం గమనించిన అభిమానులు కాస్త కలవరపడ్డారు. ఏమైంది అని చిరంజీవిని ప్రశ్నించగా ఆయన అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్న సర్జరీ అయింది అనే మెగాస్టార్‌ వెల్లడించారు.

చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. కారణం ఇదే!

మెగాస్టార్‌ చిరంజీవి కుడి చేతికి సర్జరీ జరిగింది. ఆదివారం బ్లడ్‌ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండడం గమనించిన అభిమానులు కాస్త కలవరపడ్డారు. ఏమైంది అని చిరంజీవిని ప్రశ్నించగా ఆయన అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్న సర్జరీ అయింది అనే మెగాస్టార్‌ వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కాస్త నొప్పిగా, తిమ్మిరిగా అనిపించడంతో వైద్యులను సంప్రదించానని ఆయన తెలిపారు. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్‌ నర్వ్‌ మీద ఒత్తిడి పడడం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారని డాక్టర్లు  చెప్పారని ఆయన వెల్లడించారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వేమూరి సుధాకర్‌ ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాలు జరిగిన సర్జరీలో మీడియన్‌ నర్వ్‌ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని చిరు తెలిపారు.  మీరు ఇంతలా కష్టపడుతూ, మీ బాడీని కష్టపెడుతున్నారు కాబట్టి ఒక్కోసారి ఇలా జరుగుతాయని ఇక మీదట చేతికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఆపరేషన్‌ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని, దర్శకుడు విజయబాపినీడు అల్లుడు సుధాకర్‌ ప్రత్యేక శ్రద్థ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చిరంజీవి వెల్లడించారు. 


నవంబర్‌ 1 నుంచి ‘గాడ్‌ ఫాదర్‌’ షురూ! 

సర్జరీ కారణంగా ప్రస్తుతంలో షూటింగ్‌లో ఉన్న ‘గాడ్‌ ఫాదర్‌’కు కాస్త గ్యాప్‌ ఇచ్చానని చిరంజీవి చెప్పారు. చేయాల్సిన ఫైట్‌ సీక్వెన్స్‌ పూర్తి చేసి ఈ 15 రోజులు విరామం తీసుకున్నాక నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌లో పాల్గొంటాను.  


Updated Date - 2021-10-18T02:41:35+05:30 IST