దాసరిని స్మరించుకున్న చిరు...ప్రభుత్వానికి మెగా విన్నపం

ABN , First Publish Date - 2021-05-04T18:58:15+05:30 IST

151 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు దర్శకుడు మన స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు 74వ జయంతి నేడు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ దాసరిని స్మరించుకుంటోంది. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఆయన్ని స్మరించుకుంటూ ట్వీట్‌ చేశారు.

దాసరిని స్మరించుకున్న చిరు...ప్రభుత్వానికి మెగా విన్నపం

151 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు దర్శకుడు మన స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు 74వ జయంతి నేడు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ దాసరిని స్మరించుకుంటోంది. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఆయన్ని స్మరించుకుంటూ ట్వీట్‌ చేశారు.  స్టార్‌ హీరోలతోనే కాదు.. కొత్త నటీనటులతోనూ సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్స్‌ సాధించి టాలీవుడ్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న దాసరికి ఇప్పటికీ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వకపోవడం తీరని లోటు అని చిరంజీవి ట్వీట్‌లో తెలిపారు. విజయాలలో ఒకదాన్ని మించి మరో చిత్రాన్ని అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమేనన్నారు చిరంజీవి. ఈ సందర్భంగా దాసరికి తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడంపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. దాసరికి పోస్త్‌‌మస్‌గానైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు పరిశ్రమకు దక్కే గౌరవం అవుతుందని చిరంజీవి తన ట్వీట్‌లో వెల్లడించారు.



Updated Date - 2021-05-04T18:58:15+05:30 IST