వైరల్ అవుతోన్న మెగాస్టార్ హారర్ లుక్

ABN , First Publish Date - 2021-11-01T18:02:57+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి గతంలో ‘దొంగ’ సినిమాలో గోలీమార్ అనే సాంగ్ లో భయపెడుతూనే సూపర్ స్టెప్స్ వేసి అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు మరోసారి చిరు అదే గెటప్ లో రివీలై.. అభిమానుల్ని థ్రిల్ చేశారు. అయితే అది సినిమా కోసం కాదులెండి. అక్టోబర్ 31 న హాలోవిన్ డే. చాలా మంది సెలబ్రెటీస్ ఘోస్ట్ గెటప్ తో ఫన్నీగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి దెయ్యం లుక్ లో ఉన్న ఓ ఫన్నీ వీడియో ను ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. హ్యాపీ హాలోవిన్ అంటూ విషెస్ తెలిపారు. ఉత్కంఠ భరితమైన రోజు అని కామెంట్ చేశారు. దీని కోసం చిరు మేకప్పేమీ వేసుకోలేదు. ఓ యాప్ ఉపయోగించి ఆ వీడియో చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-11-01T18:02:57+05:30 IST