చిరు ‘గాడ్ ఫాదర్’ ఊటీలో..
ABN, First Publish Date - 2021-09-22T23:52:47+05:30
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా.. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా.. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘లూసిఫర్’ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాని.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు దర్శకుడు మోహన్ రాజా. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్‌లో మెగాస్టార్ మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.