Bhola shankar : చిరు ఫోటోషూట్, లుక్ టెస్ట్ పూర్తి!

ABN , First Publish Date - 2021-11-09T20:29:46+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్ లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భోళాశంకర్’. తమిళ ‘వేదాళం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. కథానాయికగా తమన్నాను ఖాయం చేశారు. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో భోళాశంకర్ చిత్రం లాంఛ్ కానుండగా.. 15నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.

Bhola shankar : చిరు ఫోటోషూట్, లుక్ టెస్ట్ పూర్తి!

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్ లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భోళాశంకర్’. తమిళ ‘వేదాళం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. కథానాయికగా తమన్నాను ఖాయం చేశారు. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో భోళాశంకర్ చిత్రం లాంఛ్ కానుండగా.. 15నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి చిరంజీవిపై ఫోటోషూట్‌ను, లుక్ టెస్ట్ ను పూర్తి చేశారు దర్శకుడు మెహర్ రమేశ్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 



అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో కోల్ కత్తాలో జరిగే కథగా ‘భోళాశంకర్’ చిత్రం సాగుతుంది. దీనికోసం చిరంజీవి రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రల్ని పోషిస్తున్నారు. ఇందులో ఒక గెటప్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. ఆ పాత్ర పూర్తిగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది. కాగా మరో పాత్ర సాదాసీదా గెటప్ లో ఉంటుంది. ఈ రెండు పాత్రల్లో వేరియేషన్స్ ను చిరు తనదైన శైలిలో చూపిస్తారని టాక్. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో అయినా మెహర్ దర్శకుడిగా ఫామ్ లోకొస్తారేమో చూడాలి. 



Updated Date - 2021-11-09T20:29:46+05:30 IST