చిరు ‘భోళాశంకర్’.. అప్‌డేట్ ఇచ్చిన మెహర్ రమేష్
ABN , First Publish Date - 2021-11-09T03:01:42+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘భోళాశంకర్’ చిత్రానికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘భోళాశంకర్’ చిత్రానికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. నవంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే నేడు (సోమవారం) చిరు లుక్‌కు సంబంధించి ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించినట్లుగా తెలుపుతూ దర్శకుడు మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో లుక్ టెస్ట్ వివరాలతో పాటు చిత్ర ఓపెనింగ్ వివరాలను కూడా మెహర్ మరోసారి తెలియజేశారు.
కాగా, అన్నాచెల్లెళ్ల బంధం చుట్టూ తిరిగే ఈ కథలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పేరును అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. యంగ్ సెన్సేషన్ మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ భాగస్వామ్యంతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.