30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరపై చిరుతో మురళీమోహన్

ABN , First Publish Date - 2021-10-04T15:05:27+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’ కు రీమేక్ వెర్షన్. ఈ సినిమా ఇటీవలే ఊటీలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను మురళీ మోహన్ పోషిస్తుండడం ఆసక్తిని రేపుతోంది.

30 ఏళ్ళ తర్వాత  మళ్ళీ వెండితెరపై చిరుతో మురళీమోహన్

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది.  మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’ కు రీమేక్ వెర్షన్. ఈ సినిమా ఇటీవలే ఊటీలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఇందులో ఓ ముఖ్యమైన పాత్రను మురళీ మోహన్ పోషిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ముప్పై ఏళ్ళ  తర్వాత మళ్ళీ మురళీ మోహన్ చిరంజీవితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం విశేషం. ‘మనవూరి పాండవులు, చిరంజీవి, త్రినేత్రుడు, యుద్ధభూమి, గ్యాంగ్ లీడర్’ చిత్రాల్లో చిరంజీవి, మురళీ మోహన్ కలిసి నటించారు. చిరంజీవితో మురళీ మోహన్ నటించిన ఆఖరు సినిమా ‘గ్యాంగ్ లీడర్’.  ఆ సినిమా వచ్చి ఇప్పటికి 30 ఏళ్ళు దాటింది.  2018లో వచ్చిన ‘జైసింహా’ తర్వాత మురళీ మోహన్ మళ్ళీ తెరపై కనిపించడం ఇదే. 


Updated Date - 2021-10-04T15:05:27+05:30 IST