సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘బ్యాచ్’తో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మరో బాలనటుడు

ABN, First Publish Date - 2021-05-23T22:49:13+05:30

ఒకప్పుడు బాలనటులుగా నటించి.. ఇప్పుడు హీరో అయిన వారెందరో ఉన్నారు. వారి బాటలోనే ‘బాహుబలి’, ‘రేసుగుర్రం’, ‘మళ్ళీ రావా’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘నా పేరు సూర్య..’ వంటి ఎన్నో చిత్రాల్లో బాల నటుడిగా నటించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు బాలనటులుగా నటించి.. ఇప్పుడు హీరో అయిన వారెందరో ఉన్నారు. వారి బాటలోనే ‘బాహుబలి’, ‘రేసుగుర్రం’, ‘మళ్ళీ రావా’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘నా పేరు సూర్య..’ వంటి ఎన్నో చిత్రాల్లో బాల నటుడిగా నటించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరో‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘బ్యాచ్’. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై.. బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ మరియు నేహా పఠాన్ హీరోహీరోయిన్లుగా.. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్నారు. రఘు కుంచే సంగీత సారధ్యంలో మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు.


ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ.. ‘‘బ్యాచ్ ఒక యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం. యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించాము. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే మా సినిమా. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అని తెలుపగా.. ‘‘దర్శకుడు శివ చెప్పిన కథ బాగా నచ్చింది. మా చిత్రంతో బాల నటుడు సాత్విక్ వర్మని హీరోగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం జనవరిలో షూటింగ్ మొదలు పెట్టి హైదరాబాద్, విశాఖపట్నం మరియు కాకినాడ వంటి పరిసర ప్రాంతాల్లో 59 రోజుల్లో పూర్తి చేశాం. మా సినిమాకి సంగీత దర్శకుడు రఘు కుంచే మరో హీరో. పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం..’’ అని అన్నారు నిర్మాత రమేష్ ఘనమజ్జి.

Updated Date - 2021-05-23T22:49:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!