'చెరసాల' టీజర్ విడుదల చేసిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి

ABN , First Publish Date - 2021-04-08T00:44:10+05:30 IST

'చెరసాల' టీజ‌ర్‌ను సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, ట్రైల‌ర్‌ను ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుద‌ల చేయ‌గా.. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు చిత్రంలోని పాటలను విడుదల చేశారు.

'చెరసాల' టీజర్  విడుదల చేసిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి

భార్యాభ‌ర్త‌ల బంధం ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే కథాశంతో  ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే 'చెరసాల'. ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ ,రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరో, హీరోయిన్లుగా.. రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మద్దినేని సురేష్ సుధా రాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజ‌ర్‌ను సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, ట్రైల‌ర్‌ను   ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుద‌ల చేయ‌గా.. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు చిత్రంలోని పాటలను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా.. ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ "కెమెరామెన్ రామ్ ప్ర‌కాష్‌ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. సినిమా మేకింగ్ చాలా బాగుంది .నిర్మాతలు దర్శకుడికి ఫ్రీడం ఇవ్వడం వలన సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు  పెద్ద విజయం సాధించి మంచిపేరు తో పాటు,డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాను"  అన్నారు. తుమ్మ‌ల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "గత పది సంవత్సరాలుగా చిత్ర దర్శకుడు కెమెరామెన్ గా చేస్తూ 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకొని తనే కథ తయారు చేసుకుని దర్శకుడికి మారడం చాలా మంచి శుభ పరిణామం.ఇది తనకు మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు.  మంచి కంటెంట్ తో వస్తున్న హర్రర్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'చెరసాల' ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు. 


చిత్ర దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ  "నేను గత పది సంవత్సరాలుగా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ.. 24 క్రాఫ్ట్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుని ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న గుర్తింపు ఉండాలనే తపనతో..ఈ కథ రాసుకుని చేస్తున్న సినిమా ఇది. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? అనే పాయింట్‌తో ఈ సినిమా చేశాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అందరికీ నచ్చే విధంగా సైలెంట్ కామెడీని జోడించి చేశాం" అన్నారు.  చిత్ర నిర్మాత సుధారాయ్ మాట్లాడుతూ "రామ్ ప్రకాష్ కెమెరామెన్ అయినా తను చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయి ఈ మూవీ చేస్తున్నాం. బ్యూటీఫుల్ లోసెషన్స్ లలో తీసిన ఈ సినిమా మేము అనుకున్న దానికంటే చాలా చక్కగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు వస్తున్నాం" అన్నారు. 

Updated Date - 2021-04-08T00:44:10+05:30 IST