‘బ్యాక్ డోర్’కు పాకశాస్త్ర ప్రవీణుడి సపోర్ట్
ABN , First Publish Date - 2021-03-28T23:46:59+05:30 IST
సినిమాలు తీయడమే కాదు.. వాటిని విడుదల చేసే విషయంలో సమయస్పూర్తిగా వ్యవహరించడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత పోటీ వాతావరణాన్ని తట్టుకుని ప్రేక్షకులలోకి సినిమా

సినిమాలు తీయడమే కాదు.. వాటిని విడుదల చేసే విషయంలో సమయస్పూర్తిగా వ్యవహరించడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత పోటీ వాతావరణాన్ని తట్టుకుని ప్రేక్షకులలోకి సినిమా వెళ్లాలంటే.. ఉన్న దారులన్నింటిని వాడుకోవాలి. ఇప్పుడు 'బ్యాక్ డోర్' టీమ్ అదే చేస్తుంది. సినిమాలో వంటకి సంబంధించిన ఓ పాటను విడుదల చేయడానికి వారు వినూత్నంగా ఆలోచించారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. 'బ్యాక్ డోర్' చిత్రంలోని 'నోరే ఊరేలా.. కూరే కావాలా..' అనే పల్లవితో సాగే పాటను పాకశాస్త్ర ప్రవీణుడైన సుప్రసిద్ధ వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ చేతుల మీదుగా విడుదల చేశారు. నిజంగా ఇది వినూత్న ప్రయత్నం అని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రంలోని మొదటి పాటను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 'నోరే ఊరేలా... కూరే కావాలా' అనే పల్లవితో.. వంట నేపథ్యంలో సాగే ఈ పాటను తనతో విడుదల చేయించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు సంజయ్ తుమ్మ. ఈ పాట విన్నాక, చూశాక.. ఈ పాటకు కవర్ సాంగ్ చేయాలనిపిస్తోందని సంజయ్ తెలిపారు. 'బ్యాక్ డోర్' చిత్రం భారీ విజయం సాధించాలని ఆయన కోరారు. ప్రణవ్ సంగీత సారధ్యం వహిస్తున్న 'బ్యాక్ డోర్' చిత్రంలోని ఈ గీతానికి చాందిని సాహిత్యం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్ర ఆడియోను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భోజన ప్రియుల ఆదరాభిమానాలు కలిగిన సంజయ్ తుమ్మ... వంట బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాటను రిలీజ్ చేయడం, కవర్ సాంగ్ చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నంది అవార్డు గ్రహీత-చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ. ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై.. 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
