సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వాస్తవ ఘటనల ‘తనిఖీ కేంద్రం’

ABN, First Publish Date - 2021-01-28T10:42:56+05:30

‘దేవి’తో బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మహేంద్రన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తనిఖీ కేంద్రం 1995’. ఈ సినిమాకి చందిన రవికిశోర్‌ దర్శకత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘దేవి’తో బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మహేంద్రన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తనిఖీ కేంద్రం 1995’. ఈ సినిమాకి చందిన రవికిశోర్‌ దర్శకత్వం వహించారు. దీని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు  మారుతి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించాం. ఫిబ్రవరి తొలి వారంలో టీజర్‌, ఆ తర్వాత సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘‘మాస్టర్‌’లో నా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా దానికి పదింతల పేరు తెస్తుందని నమ్మకం ఉంది’’ అని మహేంద్రన్‌ అన్నారు. షజ్ఞ శ్రీవేణున్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కోటేశ్వరరావు గూడేలా, పీవీ చంద్ర నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-01-28T10:42:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!