మార్చి 19న చావు కబురు చల్లగా
ABN , First Publish Date - 2021-02-01T06:16:46+05:30 IST
కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని...

కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత ‘బన్నీ’ వాసు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘‘దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. బస్తీ బాలరాజుగా కార్తికేయ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జీఏ2 పిక్చర్స్ సంస్థలో ‘100ు లవ్’, ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాల విజయ పరంపరను ‘చావు కబురు చల్లగా’ ముందుకు తీసుకువెళ్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఆమని, మురళీ శర్మ, రజిత, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీత దర్శకుడు.