సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సాహితీ లోకానికి తీరని లోటు: చంద్రబాబు, లోకేష్

ABN, First Publish Date - 2021-12-01T03:05:26+05:30

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆ మరణం సాహితీ లోకానికి తీరని లోటు’ అని ట్విట్టర్ వేదికగా అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. సిరివెన్నెల ఆత్మకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆ మరణం సాహితీ లోకానికి తీరని లోటు’ అని ట్విట్టర్ వేదికగా అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


‘‘అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు. సీతారామశాస్త్రి గారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 


‘‘ప్రఖ్యాత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం తెలుగు చలనచిత్రపరిశ్రమ, సాహిత్య లోకానికి తీరనిలోటు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన గీతాలు.. ఆణిముత్యాలు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి గారికి అశ్రునివాళి అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2021-12-01T03:05:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!