మూడు సినిమాలు రెడీ చేస్తున్న చైతు

ABN , First Publish Date - 2021-05-15T21:04:38+05:30 IST

అక్కినేని నాగ చైతన్య మూడు సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'లవ్ స్టోరి' రిలీజ్‌కు రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్రం కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చేస్తున్నాడు.

మూడు సినిమాలు రెడీ చేస్తున్న చైతు

అక్కినేని నాగ చైతన్య మూడు సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'లవ్ స్టోరి' రిలీజ్‌కు రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్రం కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చేస్తున్నాడు. ఇటీవలే ఇటలీలో చిత్రీకరణ జరిపారు. మేజర్ టాకీపార్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో చిత్రీకరణకు హాజరు కానున్నాడని సమాచారం. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ సినిమా కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అమీర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ లెక్కన చూస్తే మూడు సినిమాలతో చైతు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్థమవుతుంది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో ఈ ప్లాన్‌లో ఏదైనా మార్పులుంటాయేమో చూడాలి.

Updated Date - 2021-05-15T21:04:38+05:30 IST