కసరత్తులు మొదలెట్టిన చైతు

ABN , First Publish Date - 2021-06-23T18:48:26+05:30 IST

కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో హీరోలు, ఇత‌ర న‌టీన‌టులంద‌రూ సినిమాల షూటింగుల‌తో బిజీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో అక్కినేని హీరో నాగ చైత‌న్య త‌న..

కసరత్తులు మొదలెట్టిన చైతు

కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో హీరోలు, ఇత‌ర న‌టీన‌టులంద‌రూ సినిమాల షూటింగుల‌తో బిజీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో అక్కినేని హీరో నాగ చైత‌న్య త‌న లేటెస్ట్ మూవీ థాంక్యూ నెక్ట్స్ షెడ్యూల్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య మూడు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఓ లుక్ కోసం చైత‌న్య మేకోవ‌ర్ అవుతున్నారు. అందులో భాగంగా, చైత‌న్య జిమ్‌లో పూర్తిస్థాయి ఎక్స‌ర్ సైజులు మొద‌లెట్టారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మ‌నం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య చేస్తున్న సినిమా థాంక్యూ. దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ అందించారు. 

Updated Date - 2021-06-23T18:48:26+05:30 IST