2020.. తారల వీడ్కోలు!
ABN, First Publish Date - 2021-01-01T18:42:05+05:30
మరో నూతన దశాబ్దం ప్రారంభమైంది. గతేడాది మానవాళికి ఎన్నో గుణపాఠాలను నేర్పింది.
మరో నూతన దశాబ్దం ప్రారంభమైంది. గతేడాది మానవాళికి ఎన్నో గుణపాఠాలను నేర్పింది. మరెన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే కాలాన్ని సానుకూలంగా, ఆశావహ దృక్పథంతో ప్రారంభించాలని సినీ తారలు ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అందరికీ విషెస్ అందజేశారు.
థాంక్యూ 2020. మాకు ఓర్పును నేర్పావు. మా జీవితాలను మార్చావు. ప్రకృతి విలువేంటో అర్థమయ్యేలా చేశావు. కొత్త సంవత్సరానికి స్వాగతం. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. మీ కలలన్నీ నిజం కావాలి. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ రావాలి - చిరంజీవి
ఈ కొత్త సంవత్సరం, మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ, అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. -పవన్ కల్యాణ్
నాకు నిత్యం ఆనందం, మానసిక బలాన్ని అందిస్తున్న నా కుటుంబం, మిత్రులు, నిర్మాతలు, దర్శకులు అందరి కంటే ముఖ్యంగా అభిమానులకు ఆల్ ది బెస్ట్. 2020 మనకు ఎన్నో కష్టాలను పరిచయం చేసింది. కానీ, మనందరం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగడానికి సిద్ధమయ్యాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - రామ్‌చరణ్
నూతన సంవత్సర శుభాకంక్షలు. ఈ ఏడాది అందరి జీవితాల్లోనూ సంతోషమే ఉండాలని కోరుతున్నాను - కాజల్
గతేడాది మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ ఏడాది అంతా మంచే జరగాలని ఆశిద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - శ్రుతి
నూతన సంవత్సర శుభాకాంక్షలు - మహేష్ బాబు
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - జూ.ఎన్టీయార్
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనమంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా - అల్లు అర్జున్
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త దశాబ్దం.. అద్భుతమైన నూతన ప్రపంచం.. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా - నాగార్జున