క్యాసెట్టు గోవిందు యాక్షన్ డ్రామా
ABN , First Publish Date - 2021-12-14T06:36:48+05:30 IST
విమల్, రవి, అశోక్, కీర్తిలత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘క్యాసెట్టు గోవిందు’. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది...

విమల్, రవి, అశోక్, కీర్తిలత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘క్యాసెట్టు గోవిందు’. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, వీర శంకర్, లక్ష్మీ సౌజన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు విరాజ్ వర్ధన్ మాట్లాడుతూ ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. చిత్ర నిర్మాత మణిధర్ కె. మాట్లాడుతూ ‘‘సినిమా మీద ఉన్న ఇష్టంతో ఉద్యోగం మానేసి వచ్చాను. మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నామనే నమ్మకం ఉంద ’’న్నారు. ఎలీషా ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు.