‘వకీల్‌సాబ్’పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. కారణమిదే!
ABN, First Publish Date - 2021-05-04T01:16:54+05:30
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' సినిమాపై సుధాకర్ అనే వ్యక్తి హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమా కారణంగా తాను మానసిక వేదనకు గురి అవుతున్నట్లుగా సుధాకర్ ఫిర్యాదులో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' సినిమాపై సుధాకర్ అనే వ్యక్తి హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమా కారణంగా తాను మానసిక వేదనకు గురి అవుతున్నట్లుగా సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి కారణం తెలిసిన వారంతా.. పాపం అంటూ అతనిపై జాలిపడుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. సినిమాలో అంజలి పని చేసే సంస్థకు చెందిన బాస్.. ఆమెను జాబ్‌కు రిజైన్ చేయమన్నప్పుడు.. ఎదురుగా ఉన్న ల్యాప్‌టాప్‌లో అంజలి అసభ్యకరమైన ఇమేజ్‌ని చూపిస్తాడు. ఆ ఇమేజ్ కింద ఓ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ నెంబరే ఇప్పుడు సుధాకర్‌ని వేదనకు గురి చేస్తుంది. ఈ ఫోన్ నెంబర్ తనది కావడంతో.. గ్యాప్ లేకుండా కాల్స్ రావడంతో పాటు, కాల్ చేసిన వారు అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారట. అందుకే.. నా అనుమతి లేకుండా నా ఫోన్ నెంబర్‌ని సినిమాలో వాడారంటూ.. పంజాగుట్ట పోలీసులను సుధాకర్ సంప్రదించాడు. పోలీసులు కేసు ఫైల్ చేసినట్లుగా సమాచారం.