కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌!

ABN , First Publish Date - 2021-02-02T07:06:19+05:30 IST

‘‘ఆది సినీ కెరీర్‌లో ‘శశి’ సినిమాలోని ‘ఒకే ఒక లోకం నువ్వు...’ పాట కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌గా నిలుస్తుంది. కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల కూడా...

కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌!

‘‘ఆది సినీ కెరీర్‌లో ‘శశి’ సినిమాలోని ‘ఒకే ఒక లోకం నువ్వు...’ పాట కెరీర్‌ బెస్ట్‌ సాంగ్‌గా నిలుస్తుంది. కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల కూడా ఈ పాటకు మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. చంద్రబోస్‌ సాహిత్యం, సిద్‌ శ్రీరామ్‌ గాత్రం, అరుణ్‌ సంగీతం ఈ పాటకు అపూర్వ ఆదరణ దక్కడానికి కారణమయ్యాయి. ఆ ముగ్గురికీ నా ధన్యవాదాలు’’ అని నటుడు సాయికుమార్‌ అన్నారు. ఆయన తనయుడు ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన చిత్రం ‘శశి’. శ్రీనివాస్‌ నాయుడు దర్శకుడు. ఆర్‌ పి వర్మ నిర్మాత. మార్చి 19న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇందులో ‘ఒకే ఒక లోకం నువ్వు...’ పాట ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందటంతో సోమవారం సాంగ్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ‘‘ఒకే ఒక లోకం నువ్వు...’ పాట ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సాధారణ ప్రేమగీతం సార్వజనీన గీతంగా మారింది’’ అని చంద్రబోస్‌ అన్నారు. ‘‘ఎక్కడకు వెళ్లినా ఈ పాటే వినిపిస్తోంది. నా కెరీర్‌లో గుర్తిండి పోయే పాట ఇది’’ అని ఆది సాయికుమార్‌ అన్నారు. ‘‘ఈ పాట విజయంలో క్రెడిట్‌ అంతా అరుణ్‌, సిద్‌ శ్రీరామ్‌, చంద్రబోస్‌కే దక్కుతుంది’’ అని దర్శకుడు చెప్పారు.  

Updated Date - 2021-02-02T07:06:19+05:30 IST