మెహరిన్‌కి పిలుపొచ్చింది

ABN , First Publish Date - 2021-11-29T11:11:39+05:30 IST

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈచిత్రంలో కథానాయికగా మెహరిన్‌ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం...

మెహరిన్‌కి పిలుపొచ్చింది

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈచిత్రంలో కథానాయికగా మెహరిన్‌ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా కాజల్‌ని ఎంచుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తరవాత అమలాపాల్‌ పేరు పరిశీలనకు వచ్చింది. చివరికి మెహరిన్‌ని టీమ్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగ్‌ సినిమాలో నటించడం మెహరిన్‌కి ఇదే తొలిసారి. ఇదో వైవిధ్యభరితమైన కథ. నాగార్జున పాత్ర, గెటప్‌ కొత్తగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇది వరకే ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Updated Date - 2021-11-29T11:11:39+05:30 IST