సుకుమార్‌: నగ్నంగా చూపించాలనుకున్నా

ABN , First Publish Date - 2021-12-27T02:52:35+05:30 IST

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. పక్కా ఊర మాస్‌ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది. అయితే చిత్రంలో కొన్ని సన్నివేశాలకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే!

సుకుమార్‌: నగ్నంగా చూపించాలనుకున్నా

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. పక్కా ఊర మాస్‌ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది. అయితే చిత్రంలో కొన్ని సన్నివేశాలకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! క్రైమాక్స్‌లో ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్లున్‌ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా అండర్‌ వేర్‌ లో కనిపించి పోటాపోటీగా డైలాగ్స్‌ చెప్పారు. అయితే ఆ సన్నివేశం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సన్నివేశంపై దర్శకుడు సుకుమార్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌, షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సన్నివేశంలో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా. కానీ తెలుగు ఆడియన్స్‌ ఇలాంటి సన్నివేశాలను అంతగా అంగీకరించరని అప్పటికప్పుడు మార్పులు చేశాం’’ అని సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. పార్ట్‌2లో ఇంతముమించి ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. ఫస్ట్‌ పార్ట్‌లో కేవలం పాత్రలను పరిచయం చేశామని, అసలు కథ సెకండ్‌ పార్ట్‌లో ఉంటుందన్నారు. 


Updated Date - 2021-12-27T02:52:35+05:30 IST