సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బన్నీకి బ్రహ్మానందం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

ABN, First Publish Date - 2021-01-01T20:25:34+05:30

కోవిడ్‌ ప్రభావం వల్ల విధించిన లాక్డౌన్‌ సమయంలో బ్రహ్మానందం తనలోని చిత్రకారుడిని బయటకు తెచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్‌ కమెడియన్‌గా బ్రహ్మానందకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కోవిడ్‌ ప్రభావం వల్ల విధించిన లాక్డౌన్‌ సమయంలో ఆయన తనలోని చిత్రకారుడిని బయటకు తెచ్చారు. భారతదేశంలో కరోనా కట్టడికి చేసిన లాక్డౌన్‌ గురించి తెలియజేస్తూ.. హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడు, ఆనంద బాష్పాలు కారుస్తున్న హనమంతుడు .. ఇలా బొమ్మలను అద్భుతంగా చిత్రీకరించారు. తాజాగా కొత్త సంవత్సరం రోజున వెంకటేశ్వరస్వామి బొమ్మను గీసి దాన్ని ఫ్రేమ్‌ చేసి అల్లు అర్జున్‌కు గిఫ్ట్‌గా పంపారు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా తెలియజేశారు. 'బ్రహ్మానందంగారి నుండి అందుకున్న అమూల్యమైన బహుమతి, 45 రోజుల పాటు శ్రమించి ఈ స్కెచ్‌ వేశారు. ఆయనకు నా ధన్యవాదాలు' అని బ్రహ్మానందంకు థాంక్స్‌ చెప్పారు. 




Updated Date - 2021-01-01T20:25:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!