‘బహ్మాస్త్ర’ హీరో లుక్‌కి ముహూర్తం కుదిరింది!
ABN , First Publish Date - 2021-12-13T01:03:17+05:30 IST
బీటౌన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బహ్మాస్త్ర’ బాలీవుడ్ లవ్బర్డ్ప్ రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో కనిపిస్తారు. కరోనా వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ ఉంది.

బీటౌన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బహ్మాస్త్ర’ బాలీవుడ్ లవ్బర్డ్ప్ రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో కనిపిస్తారు. కరోనా వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తవుతుంది. డిస్నీ సంస్థతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. అందులో భాగంగా ప్రచారానికి కూడా రంగం సిద్ధమవుతోంది. రణ్‌బీర్ కపూర్ పోషించిన శివ త్రిపాఠి పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ని ఈ నెల 15న విడుదల చేయాలని నిర్మాత కరణ్‌జోహార్ నిర్ణయించారు. పురాణ గాథతో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.