వేదవ్యాస్‌ మాట్లాడాడంటే... !

ABN , First Publish Date - 2021-09-20T12:33:49+05:30 IST

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న బ్రహ్మానందం ‘పంచతంత్రం’ సినిమా కోసం కథకుడిగా కొత్త అవతారం...

వేదవ్యాస్‌ మాట్లాడాడంటే... !

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న బ్రహ్మానందం ‘పంచతంత్రం’ సినిమా కోసం కథకుడిగా కొత్త అవతారం ఎత్తారు. ఈ సినిమాలో ఆయన వేదవ్యాస్‌ పాత్రను పోషిస్తున్నారు. ‘కథకుడు రెడీ’ అంటూ మైక్‌ ముందు మాట్లాడుతున్న బ్రహ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. తన నటనతో మనసుల్ని కదలించేలా బ్రహ్మనందం పాత్ర ఉంటుందని చిత్ర దర్శకుడు హర్ష పులిపాక చెప్పారు.  సముద్రఖని, స్వాతీరెడ్డి, శివాత్మిక, రాహుల్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్న ‘పంచతంత్రం’ చిత్రాన్ని అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోటు నిర్మిస్తున్నారు. ‘రెండేళ్ల విరామం తర్వాత బ్రహ్మనందం నటిస్తున్న సినిమా ఇది. పూర్తి విభిన్నమైన పాత్రలో ఆయన కనిపిస్తారు. వేదవ్యాస్‌గా ఆయన పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది.  ఆయన సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. పంచతంత్రం కథ, పాత్రలను వివరించే కథకుడిగా బ్రహ్మానందం కనిపిస్తారని దర్శకుడు చెప్పారు.

Updated Date - 2021-09-20T12:33:49+05:30 IST