బాలీవుడ్‌ ఎడిటర్‌ వామన్‌ భోంస్లే మృతి

ABN , First Publish Date - 2021-04-27T06:00:30+05:30 IST

‘రామ్‌లఖన్‌’, ‘సౌదాగర్‌’, ‘గులాం’, ‘హీరో’, ‘అగ్నిపథ్‌’ లాంటి పలు బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన సీనియర్‌ ఎడిటర్‌ వామన్‌ భోంస్లే ముంబైలో...

బాలీవుడ్‌ ఎడిటర్‌ వామన్‌ భోంస్లే మృతి

‘రామ్‌లఖన్‌’, ‘సౌదాగర్‌’, ‘గులాం’, ‘హీరో’, ‘అగ్నిపథ్‌’ లాంటి పలు బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన సీనియర్‌ ఎడిటర్‌ వామన్‌ భోంస్లే ముంబైలో సోమవారం కన్నుమూశారు. వయసు పై బడటం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1967లో వచ్చిన ‘దో రాస్తే’ ఎడిటర్‌గా ఆయన తొలిచిత్రం. సుభాష్‌ ఘాయ్‌, శేఖర్‌కపూర్‌, గుల్జార్‌, రాజ్‌సిప్పి, మహేశ్‌భట్‌ లాంటి పలువురు ప్రముఖ దర్శకుల చిత్రాలకు వామన్‌ భోంస్లే ఎడిటర్‌గా పనిచేశారు. బాలీవుడ్‌లో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. 25వ జాతీయ పురస్కారాల్లో ‘ఇంకార్‌’ చిత్రానికి ఆయన ఉత్తమ ఎడిటర్‌ పురస్కారం అందుకున్నారు. వామన్‌ భోంస్లే మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Updated Date - 2021-04-27T06:00:30+05:30 IST