సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్‌ నటుడు చంద్రశేఖర్‌ మృతి

ABN, First Publish Date - 2021-06-17T10:32:00+05:30

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, నిర్మాత చంద్రశేఖర్‌ (98) బుధవారం ఉదయం నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. వయసు పై బడటం వల్ల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, నిర్మాత చంద్రశేఖర్‌ (98) బుధవారం ఉదయం నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. వయసు పై బడటం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిర్మాత అశోక్‌ శేఖర్‌ తెలిపారు.  హైదరాబాద్‌లో జన్మించిన చంద్రశేఖర్‌ నటనపై ఆసక్తితో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. 250కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. నిర్మాతగా కొనసాగుతూనే కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1990వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్‌లో రథ సారథి సుమంతుడి పాత్రలో చంద్రశేఖర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 


Updated Date - 2021-06-17T10:32:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!