‘భీమ్లా నాయక్’ రానా టీజర్: నీ మొగుడు గబ్బర్‌సింగ్ అంట.. నేనెవరో తెలుసా?

ABN , First Publish Date - 2021-09-20T23:52:22+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్‌ప్లే- సంభాషణలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర..

‘భీమ్లా నాయక్’ రానా టీజర్: నీ మొగుడు గబ్బర్‌సింగ్ అంట.. నేనెవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్‌ప్లే- సంభాషణలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. కాగా ఈ చిత్రం నుంచి ‘రానా’ పరిచయ టీజర్‌ను ‘బ్లీట్జ్ ఆఫ్ డేనియల్ శేఖర్’ పేరుతో సోమవారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేసింది చిత్రబృందం. డేనియల్ శేఖర్‌గా రానా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్నది ఈ బ్లీట్జ్‌లో చూపించారు. ‘భీమ్లా నాయక్’గా చేస్తున్న పవన్ కల్యాణ్ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, మీసం తిప్పడం వంటివి సన్నివేశాలు ఈ టీజర్‌లో హైలెట్ అని చెప్పవచ్చు. 


‘‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా ధర్మేంద్ర... హీరో ..హీరో..!

డేనీ ఎంటర్ టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్...!’’ అంటూ ఈ టీజర్‌లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఆయన పాత్ర తీరును స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని, 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన మరో మలయాళ భామ సంయుక్తా మీనన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.



Updated Date - 2021-09-20T23:52:22+05:30 IST