హీరోగా ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్
ABN , First Publish Date - 2021-12-27T14:10:03+05:30 IST
క్రేజీ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ .. 5వ సీజన్ ఇటీవలే విజయవంతంగా ముగిసింది. సన్నీ విజేతగా నిలిచాడు. అయితే ఈ షోలో తన పెర్ఫార్మెన్స్ పరంగా అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం జెస్సీ. అయితే అనారోగ్య కారణాలతో మధ్యలోనే ఈ షో నుంచి నిష్ర్కమించాడు. అయితేనేం.. మరో విధంగా అదృష్టం అతడి తలుపు తట్టింది. హీరోగా ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

క్రేజీ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ .. 5వ సీజన్ ఇటీవలే విజయవంతంగా ముగిసింది. సన్నీ విజేతగా నిలిచాడు. అయితే ఈ షోలో తన పెర్ఫార్మెన్స్ పరంగా అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం జెస్సీ. అయితే అనారోగ్య కారణాలతో మధ్యలోనే ఈ షో నుంచి నిష్ర్కమించాడు. అయితేనేం.. మరో విధంగా అదృష్టం అతడి తలుపు తట్టింది. హీరోగా ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. సినిమా పేరు ‘ఎర్రర్ 500’. మైత్రేయ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యు.బాల్ రెడ్డి నిర్మాణంలో సాందీప్ మైత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. గన్ గురిపెడుతూ ఇంటెన్స్ గా రివీలైన జెస్సీ లుక్ ఆకట్టుకుంటోంది. జెస్సీ ఈ విషయాన్ని తెలియచేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశాడు.
‘నా మొదటి సినిమా ‘ఎర్రర్ 500’. ఇందులో చాలా సర్‌ప్రైజులున్నాయి. మీ ప్రేమాభిమానాలతో నేను ఈ సినిమాలో నటిస్తున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. భవిష్యత్ లో ఎంతోమందిని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తాను’... అంటూ జెస్సీ ఓ వ్యాఖ్యను కూడా జతచేశాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమాతో జెస్సీ టాలీవుడ్ లో హీరోగా స్థిరపడతాడని ఆశిద్దాం.