సెట్‌లోకి అడుగుపెట్టిన ‘భోళాశంకర్‌’

ABN , First Publish Date - 2021-11-16T06:02:14+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం మొదలైంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏ.ఎస్‌.ప్రకాశ్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న భారీ సెట్‌లో చిరంజీవి మీద కొన్ని కీలకమైన సన్నివేశాలు...

సెట్‌లోకి అడుగుపెట్టిన ‘భోళాశంకర్‌’

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్‌’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం మొదలైంది. ఆర్ట్‌ డైరెక్టర్‌  ఏ.ఎస్‌.ప్రకాశ్‌ సారథ్యంలో రూపుదిద్దుకున్న భారీ సెట్‌లో చిరంజీవి మీద కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మెహర్‌ రమేశ్‌. ఈ చిత్రంలో చిరంజీవిని విభిన్న గెటప్స్‌లో ఆయన చూపించబోతున్నారు.  తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి  సురేశ్‌ నటిస్తున్నారు. కమర్షియల్‌ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థ సహకారంతో అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.


Updated Date - 2021-11-16T06:02:14+05:30 IST